Sasirekhaa Parinayam Songs Lyrics – Eedo Oppukoonandi naa Praanam

Eedo oppukoonandi naa praanam..(eedo eedho song 2 also included…)

Movie: Sasirekha Parinayam

Music: Mani Sharma

Lyrics: Sirivennelaseetharama Sastry

Eedo Oppukoonandi naa Praanam Song lyrics

ఏదో ఒప్పుకోనంది నా ప్రాణం

అది యేదో చెప్పలేనంది ఈ వైనం

కలత పడుతోందే లోలోనా

కసురుకుంటోందే నాపైనా

తన గుబులు నేనో, నా దిగులు తానో

కొంచమైనా పంచుకుంటే తీరిపోతుందేమో భారం

యెదొ యెదొ యేదో ఒప్పుకోనంది నా ప్రాణం

అది యేదో చెప్పలేనంది ఈ వైనం

పచ్చగా ఉన్నా పూదోట నచ్చడం లేదే ఈ పూట

మెచ్చుకుంటున్నా ఊరంతా గిచ్చినట్టుందే నన్నంతా

పచ్చగా ఉన్నా పూదోట నచ్చడం లేదే ఈ పూట

మెచ్చుకుంటున్నా ఊరంతా గిచ్చినట్టుందే నన్నంతా

ఉండలేను నెమ్మదిగా, యెందుకంట తెలియదుగా

ఉండలేను నెమ్మదిగా, యెందుకంట తెలియదుగా

తప్పటడుగో, తప్పు అనుకో, తప్పదే తప్పుకుపోదాం

తక్షణం అంటూ పట్టు పడుతోంది ఆరాటం

పదమంటూ నెట్టుకెడుతోంది నను సైతం

అందరూ నడిచే దారైనా అడవిలా మారిందనుకోనా

నేస్తమై వచ్చే నీడైనా నిందలేస్తోందేం నా పైనా

అందరూ నడిచే దారైనా అడవిలా మారిందనుకోనా

నేస్తమై వచ్చే నీడైనా నిందలేస్తోందేం నా పైనా

కంటబడని శత్రువులా సొంత మనసు యెందుకిలా

కంటబడని శత్రువులా సొంత మనసు యెందుకిలా

కక్షగడుతూ రెచ్చగొడుతూ ఇంత వేధించే గాయం

యేమిటో యేమో తేల్చుకోలేని అనుమానం

తెలుసేమో బైట పడలేని అభిమానం