The Telangana music scene is buzzing again with a powerful, energetic folk song — “Daripontothundu”. Released on Tree Music YouTube channel, the track has quickly gone viral across platforms like YouTube Shorts, Instagram Reels, and local WhatsApp groups.
Blending the traditional beats of Telangana with modern DJ-style rhythms, “Daripontothundu” is more than just a song — it’s a cultural celebration in motion. The song has become an anthem in rural and urban Telangana alike, played at functions, processions, and festivals.
💥 Why It’s Trending
- Viral factor: Over 25 million views in less than a month.
- Relatable local flavor: Telangana dialect, bold female vocals, and energetic beats.
- Cultural connect: Features Naga Durga’s dynamic dance steps with rural visuals.
- Reel content magnet: Perfectly loop-worthy for social media.
Also read, Telangana State song Lyrics in Telugu – Jaya Jaya He Telangana
Credits :
- Music : Madeen Sk
- Lyrics & Singer : Mamidi Mounika
- Dop : Shiva Velupula
- Editing & Di : Ajay Rangu
- Choreographer : Shekar Virus ( Sunny Ganesh)
దారిపొంటత్తుండు (Daripontothundu) Song Lyrics:
ఆహా… దారిపొంటత్తుండు దవ్వ దవ్వత్తుండు
దారిద్దునా పోనిద్దునా
జోరు మీద అత్తుండు కారు మీద అత్తండు
తోలేద్దునా పోనీ ఉకుంద్దునా
(దారిలో వస్తున్నాడు, స్పీడ్‌గా వస్తున్నాడు…
దారి ఇవ్వాలా, పోనివ్వాలా…
జోరు మీద వస్తున్నాడు,
కారు మీద వస్తున్నాడు,
పోనివ్వనా లేక ఊర్కోవాలా…)
దారిపొంటత్తుండు రానిద్దునా
తొవ్వ పొంటత్తుండు పోనిద్దునానా ఎనక నా ఎనక నా ఎనక నా ఎనక
నా ఎనక పడుత్తుండు నా ముందుటుంటుండు
సంధిద్దునా వద్ద వందిద్దునా
ఇనుకుంటా పోతాండు అనుకుంటా వతాండు
బందైదునా బంధమై చూపనా
(నా వెనుకే పడుతున్నాడు…
ఎప్పుడూ నా ముందే కనిపిస్తున్నాడు,
పక్కకు జరగనా, విసిగించనా…
ఏదో వినుకుంటూ వస్తున్నాడు,
ఏదో అనుకుంటూ పోతున్నాడు,
ఆపేయనా, బంధమై పోనా…)
Also read, Ranu Bombai Ki Ranu Song Lyrics & English Translation
ఆహా గాలి గాలిజేత్తుండు గండమై కూసుండు
గాలిద్దునా.. అహహా
అహ ఆహా గాలి గాలిజేత్తుండు గండమై కూసుండు
గాలిద్దునా ఇన్నీ గోలిద్దునారాయే పోయే అంటుండు రౌసు పెట్టుకుంటుండు
రమ్మందునా విన్నీ పొమ్మందునా
గాలి గాలిజేత్తుండు గరమైదునా
సోయి లేకంటుండు సంధుద్దునా
గాలిగాలి గాలిగాలి గాలిగాలి గాలిగాలి
గాలిగాలి చేత్తుండు గడుసుదాన్ని అంటుండు
తల తింటాడే తరమైతలే
సోయి లేకంటుండు సోపతైతాంటాండు
సోయి ఉన్నదో వీనికి సోకున్నదో
(గాలి గాలి చేస్తున్నాడు,
పెద్ద గండమైపోయాడు… గాలించనా, వేయించనా…
రావే పోవే అంటాడు, గొడవ పెట్టుకుంటాడు, రమ్మననా, పొమ్మననా…
కోపగించనా, పక్కకు వెళ్లిపోనా…
గడుసుదాన్ని అంటాడు, తల తింటున్నాడు, వశపడతలేదు…
సోయి లేక ఉంటాడు, దోస్తీ చేస్తానంటాడు… ఇది సోయా, లేక వీడి సోకా..?)
ఆహా తిప్పిచుకుంటుండు తప్పిచుకుంటుండు
ఒప్పిద్దునా విన్నీ తప్పిద్దునా
ఈడైతానంటుండు జోడైతానంటుండు
ఇరిసేద్దునా విన్నీ మరిసుందునా
(తిప్పించుకుంటాడు, తప్పించుకుంటాడు, ఒప్పించాలా, వీడిని తప్పించాలా…
ఈడూ జోడూ అంటాడు, వీడి కథను ఇక్కడే విరిచేయనా, మరిచిపోనా…)
తిప్పిచుకుంటుండు తింగరోడే
తప్పించుకుంటుండు తిక్కలోడే
వర్రిచ్చి వర్రిచ్చి వర్రిచ్చి వర్రిచ్చి
వర్రిచ్చికుంటుండు జర్రాగే అంటుండు
రానియ్యడే ముందుపోనియ్యడే
ఆగమైతంటుండు అంగడైతంటుండు
ఎగైతాడో వీడేమైతాడో
(ఒకటే వాగనిస్తాడు, కాస్త ఆగవే అంటాడు…
రానివ్వడు, ముందుకు పోనివ్వడు,
నేను ఊఁ అనకపోతే ఆగమైపోతాడట, అంగడైపోతాడట… ఏమైపోతాడు వీడు…)
ఆహా ఎట్లైతే గట్లాయే ఎంబడే ఉండోయి
వెనక రావోయి నా వెంట రావోయ్
నీ మీద మనసయింది వరసైతే కలిసింది
ఇడిసుండకొయ్ పిల్లగా మరిసుండకొయ్
నాగు పాము కోపమొడే జెర్రు పోతు పిరుకోడే
(సరే, ఎట్లయితే అట్లాయె,
నా వెంబడే ఉండవోయి, నా వెనుకే రా, నా వెంటే రా, నీమీదే మనసవుతోంది,
వరస కూడా కలిసింబది, నన్ను విడిచి ఉండకోయి,
ఓ అబ్బాయీ, నన్ను మరిచి ఉండకోయి, అసలే నాగుపాము కోపమున్నోడు,
కాకపోతే జెర్రిపోతుకున్నంత పిరికి కూడా…)
అగ్గగో అగ్గగో అగ్గగో అగ్గగో
అగ్గగో కొమరెల్లి మల్లన్న కొలిసి మొక్కుతున్న
కంటసూడే మమ్ము జంట చెయ్యే
ఐలేని మల్లన్న ఆశతో మొక్కుతున్న
అన్ని కలిసే తొవ్వ చూపరాదే
(కొమురవెల్లి మల్లన్నా నిన్ను కొలుస్తా,
మొక్కుతా, కాస్త కరుణ చూడు, మమ్మల్ని జంటగా చేయి, ఐలేని మల్లన్నా,
ఆశతో మొక్కుతున్నా నీకు, అన్నీ చక్కబడే దారి చూపు…)
పర్వతాల మల్లన్న పప్పతి పడుతున్న
మరవబాకే మమ్ము కలుపరాదే
ఎములాడ రాజన్న కోడినే కడుతాను
ఎంబాటుండేటోన్ని పిలవరాదే
(పర్వతాల మల్లన్నా, దండం పెడుతున్నా,
మరిచిపోకు, మమ్మల్ని కలుపు కాస్త…
వేములవాడ రాజన్నా కోడెను కడతా, నా వెంబడే ఉండేవాడిని నాకు కలుపు…)
Related Posts





One thought on “Daripontothundu Song Lyrics & Meaning: Telangana Folk Song”
Comments are closed.